: తప్పుడు సర్టిఫికెట్ల కేసులో ఆమ్ ఆద్మీ మంత్రి అరెస్ట్
తప్పుడు ధ్రువపత్రాలను సమర్పించిన కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ న్యాయ శాఖ మంత్రి జితేంద్ర సింగ్ తోమర్ ను ఈ ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఆప్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సమయంలో, విద్యార్హతలకు సంబంధించి తప్పుడు సమాచారం ఇచ్చారన్నది తోమర్ పై ప్రధాన ఆరోపణ. ఓ యూనివర్శిటీ నుంచి తాను న్యాయ పట్టాను పొందానని ఆయన అప్పట్లో దాఖలు చేసిన అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఆయన న్యాయశాస్త్రం చదవలేదని ఆరోపణలు రావడంతో కేసు నమోదైంది. తోమర్ తప్పుడు పత్రాలను జతపరిచారని విచారణలో తేల్చిన పోలీసులు నేడు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.