: 'అశోబా' వచ్చేస్తోంది... మనకేం ప్రమాదం లేదట!
అరేబియా మహాసముద్రంలో గంటగంటకూ 'అశోబా' విస్తరిస్తోంది. ఈ 'అశోబా' ఏంటని అనుకుంటున్నారా? అరేబియాలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారడంతో దానికి ఈ పేరు పెట్టారు. ఇది మరింత బలపడి పెను తుపానుగా మారే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, ఇది భారత్ లో తీరం దాటే అవకాశాలు లేవని నిపుణులు వెల్లడించారు. కాగా, ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని అధిక ప్రాంతాలను మబ్బు కమ్మేసింది. పలు చోట్ల చిరు జల్లుల నుంచి తేలిక పాటి వర్షాలు పడుతున్నాయి.