: రేవంత్ రెడ్డి ఏసీబీ కస్టడీ నేటితో పూర్తి... సాయంత్రం కోర్టుకు టీ టీడీఎల్పీ ఉపనేత


ఓటుకు నోటు వ్యవహారంలో సీక్రెట్ కెమెరాలకు అడ్డంగా బుక్కైన టీ టీడీఎప్పీ ఉపనేత రేవంత్ రెడ్డి ఏసీబీ కస్టడీ నేటితో ముగియనుంది. నాలుగు రోజుల క్రితం కోర్టు అనుమతితో రేవంత్ రెడ్డిని తమ అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు పలు కోణాల్లో విచారించారు. తొలి రోజు కేవలం రెండు గంటల పాటు రేవంత్ ను విచారించిన ఏసీబీ అధికారులు, ఆ తర్వాత ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. గంటల తరబడి సాగిన ఏసీబీ విచారణలో రేవంత్ రెడ్డి పెద్దగా నోరు విప్పిన దాఖలా కనిపించలేదు. దీంతో రేవంత్ కస్టడీని మరిన్ని రోజులు పొడిగించాలన్న ఏసీబీ వాదనను కోర్టు తోసిపుచ్చింది. దీంతో నేటి విచారణ పూర్తైన తర్వాత సాయంత్రం 4 గంటలకు ఏసీబీ అధికారులు రేవంత్ రెడ్డిని కోర్టులో హాజరుపరచనున్నారు. రేవంత్ రెడ్డితో పాటు ఈ కేసులో సహ నిందితులుగా ఉన్న సెబాస్టియన్, ఉదయ సింహలను కూడా ఏసీబీ అధికారులు కోర్టులో హాజరుపరుస్తారు.

  • Loading...

More Telugu News