: హైదరాబాదులో వాల్ పోస్టర్లు, వాల్ రైటింగ్స్ నిషేధం


హైదరాబాదును క్లీన్ గా తయారు చేయాలన్న కేసీఆర్ ఆలోచనలను ఆచరణలో పెట్టేందుకు జీహెచ్ఎంసీ పావులు కదుపుతోంది. తెలంగాణ మంత్రులు నాయిని, పద్మారావు సమక్షంలో జీహెచ్ఎంసీ సమన్వయకమిటీ సమావేశంలో పలు కీలక సమస్యలపై సుదీర్ఘచర్చ జరిగింది. ఈ సందర్భంగా హైదరాబాదు నగరంలో ఉన్న వాల్ పోస్టర్లు, వాల్ రైటింగ్స్ కనపడకుండా చేయాలని నిర్ణయించారు. అలాగే ప్రధాన సమస్యగా ఉన్న చెత్త, నాలాల ఆక్రమణ, మంచినీటి సరఫరాపై సుదీర్ఘ చర్చ జరిగింది. అలాగే జీహెచ్ఎంసీలో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని సూచించారు.

  • Loading...

More Telugu News