: ప్రతిపక్షాలవి అర్థం పర్థం లేని ఆరోపణలు: స్మృతీ ఇరానీ
భారతీయ పురాతన విద్యా విధానాన్ని ప్రపంచం మొత్తం పొగడ్తల్లో ముంచెత్తుతుంటే...ప్రతి పక్షాలు మాత్రం అర్ధం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నాయని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ మండిపడ్డారు. ఢిల్లీలో హిందూ ఎడ్యుకేషన్ బోర్డు నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, పురాతన భారతీయ విద్య, విలువలు, పద్ధతులను ప్రపంచం మొత్తం ప్రశంసిస్తోందని అన్నారు. భారతీయ గణిత శాస్త్రాన్ని ప్రపంచం మొత్తం శ్లాఘించిందని ఆమె గుర్తు చేశారు. ప్రపంచం మొత్తం పొగడ్తల్లో ముంచెత్తుతున్న విద్యను కాషాయీకరణ చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు అర్ధం పర్థం లేని ఆరోపణలు చేస్తున్నాయని ఆమె మండిపడ్డారు.