: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు సఖ్యతతో ముందుకెళ్లాలి: వెంకయ్యనాయుడు


ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలిపారు. రెండు రాష్ట్రాలు సఖ్యతతో వ్యవహరించి ముందుకెళ్లాలని సూచించారు. అంతేగాక ఇరు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీపడుతూ ముందుకు కొనసాగాలని, ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వాలు పనిచేయాలని హితవు పలికారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సహాయం అందిస్తుందని ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న సమయంలో వెంకయ్య పునరుద్ఘాటించారు.

  • Loading...

More Telugu News