: నేరుగా స్టీఫెన్ సన్ తో మాట్లాడి చంద్రబాబు దొరికిపోయారు... ఆయన తప్పించుకోలేరు: ఈటెల


నోటుకు ఓటు వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని టీఎస్ ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఈ వ్యవహారంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని... ఏసీబీనే అంతా చూసుకుంటోందని చెప్పారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తో ఫోన్ లో మాట్లాడి... చంద్రబాబు అడ్డంగా బుక్కయ్యారని తెలిపారు. ఈ మొత్తం వ్యవహారానికి చంద్రబాబే సూత్రధారి అని... ఆయన డైరెక్షన్ లోనే అంతా నడిచిందని ఈటెల విమర్శించారు. ఫోన్ ట్యాప్ చేశామని టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని అన్నారు.

  • Loading...

More Telugu News