: తెలంగాణలో కేసీఆర్ పై పరువునష్టం దావా కేసులు వేసిన తెలుగుదేశం


కేసీఆర్ పై చట్టపరమైన చర్యలు తీసుకునే దిశగా తెలుగుదేశం పార్టీ అడుగులు వేసింది. తమ అధినేత చంద్రబాబునాయుడి పరువుకు నష్టం కలిగేలా కేసీఆర్ ప్రవర్తించారని, చట్టవ్యతిరేకంగా ఫోన్లను ట్యాప్ చేశారని ఆరోపిస్తూ, పలువురు తెలుగుదేశం నేతలు ఈ కేసులు దాఖలు చేశారు. సూర్యాపేట, నల్గొండ పోలీసు స్టేషన్లలో ఈ మేరకు కేసులు నమోదయ్యాయి. కాగా, నిన్న బాబు మాట్లాడిన మాటలుగా ఆడియో టేపులు వెలుగులోకి వచ్చిన తరువాత రాజకీయ దుమారం చెలరేగగా, ఈ ఉదయం ఏపీలోని పలు జిల్లాల పోలీసు స్టేషన్లలో తెలుగుదేశం కార్యకర్తలు, నేతలు కేసీఆర్ పై కేసులు పెట్టిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News