: బాలకృష్ణను సీఎం చేయాలి: షబ్బీర్ అలీ


ఓటుకు నోటు వ్యవహారంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇరుక్కోవడంపై టి. కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ ఘాటుగా స్పందించారు. హైదరాబాద్ గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడుతూ... 1995 నుంచి చంద్రబాబు రాజకీయ చదరంగం మొదలు పెట్టారని, ఇప్పుడదే రాజకీయ చదరంగంలో ఇరుక్కున్నారని వ్యంగ్యం ప్రదర్శించారు. చంద్రబాబుకు నైతికత ఉంటే పదవికి రాజీనామా చేయాలని అన్నారు. గతంలో ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేశాడని విమర్శించారు. ఎన్టీఆర్ ఆత్మకు శాంతి కలగాలంటే ఆయన తనయుడు బాలకృష్ణకు సీఎం పదవి ఇవ్వాలని అన్నారు. ఇక, చంద్రబాబు, కేసీఆర్ లది గురుశిష్య బంధం అని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News