: చిరంజీవి అన్నం వండేవాడు, నేను కూరలు వండేవాడిని: సినీ నటుడు సుధాకర్
ప్రముఖ సినీ నటుడు సుధాకర్ తన మిత్రుడు చిరంజీవితో కలసి ఉన్నప్పటి జ్ఞాపకాలను ఓ టీవీ చానల్ తో పంచుకున్నారు. తాను, చిరంజీవి, హరి ప్రసాద్ లు ఒకే రూమ్ లో ఉండేవారమని చెప్పారు. రూమ్ లో చిరంజీవి అన్నం వండేవాడని, తాను కూరలు చేసేవాడినని, మార్కెట్ నుంచి కావాల్సినవి హరి ప్రసాద్ తీసుకువచ్చేవాడని తెలిపారు. ఏదో ఒక రోజు సినిమాలలో గుర్తింపు పొందుతామన్న ఆశాభావం తమలో ఉండేదని చెప్పారు. అయితే, స్టార్ల స్థాయికి ఎదుగుతామని ఊహించలేదని వెల్లడించారు. ఆ తర్వాత తమిళ సినిమాలలో తాను బిజీ అయిపోయానని... చిరంజీవి తెలుగు సినిమాల్లో బిజీ అయిపోయాడని అన్నారు. ఆపదలో ఉన్నప్పుడు ఎవరైనా ఆదుకున్నారా అన్న ప్రశ్నకు... 'చిరంజీవి ఉన్నాడుగా!' అంటూ సమాధానమిచ్చారు.