: 'ది హిందూ' పేపర్ చదివే అబ్బాయే కావాలని 'టైమ్స్ ఆఫ్ ఇండియా'లో ప్రకటన!


ఆమె 'ది హిందూ' పేపరుకు అభిమానేమో. తన అభిమానాన్ని చూపేందుకు ఎంచుకున్న పద్ధతి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చర్చకు దారితీసింది. 'టైమ్స్ ఆఫ్ ఇండియా' కాస్మొపాలిటన్ క్లాసిఫైడ్స్ విభాగంలో తాను వివాహం చేసుకునేందుకు హిందూ పేపర్ చదివే అబ్బాయి కావాలని ప్రకటన ఇచ్చింది. ప్రముఖ రాజకీయనేత సుబ్రమణ్య స్వామి ఈ యాడ్ పోస్టును తన ఫేస్ బుక్ పేజీలో పెట్టగా, సుమారు 1200 'షేర్స్', వేలాదిగా 'లైక్స్' వచ్చాయి. ఆ యాడ్ లో "కావలెను: హిందూ పేపర్ చదివే వరుడు కావలెను. ఎందుకంటే హిందూ నిజాన్ని చెబుతుంది. క్లుప్తంగా, చక్కగా వార్తలుంటాయి. వారు తాము ప్రచురించే ప్రకటనలను ముందు చదివి ఆపై ప్రచురణకు పంపుతారు" అని ఉంది. ఈ యాడ్ ను టైమ్స్ ఉద్యోగులు ఏ మాత్రం చూడకుండా, ఎడిట్ చేయకుండా క్లాసిఫైడ్స్ లో ప్రకటించడం విమర్శలకు దారి తీస్తోంది. గతంలో కూడా దక్కన్ క్రానికల్ లో వచ్చిన క్లాసిఫైడ్స్ ప్రకటనలను ఉన్నవి ఉన్నట్టుగా టైమ్స్ లో ప్రచురితమైన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News