: మరో మహిళతో సహజీవనం చేస్తున్న భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న యాంకరమ్మ
ఒకరిని వివాహం చేసుకొని మరో మహిళతో సహజీవనం చేస్తున్న భర్త బండారాన్ని బట్టబయలు చేసిందో యాంకర్. వివరాలిలా వున్నాయి. హైదరాబాదులో ఓ టీవీ చానల్ లో యాంకర్ గా పనిచేస్తున్న పద్మావతికి కుషాయిగూడకు చెందిన సంతోష్ తో వివాహం అయింది. పెళ్లి తరువాత భర్త మరో మహిళతో అక్రమ సంబంధం నడుపుతున్నాడని తెలుసుకున్న పద్మావతి మహిళా సంఘాలతో కలసి భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ప్రియురాలితో కలసివుండగా ఇంట్లోకి ప్రవేశించింది. పద్మావతిపై మీడియా ముందే సంతోష్ చెయ్యి చేసుకున్నాడు. పద్మావతి సైతం చీపురు తిరగేసింది. ఈ దృశ్యాలన్నీ వీడియోలో రికార్డయ్యాయి. తమ వివాహమై 10 సంవత్సరాలైందని, ఒక్క రోజు కూడా సంతోషంగా లేనని పద్మావతి వాపోయింది. 30 తులాల బంగారం, రూ. 10 లక్షలు కట్నంగా ఇచ్చినప్పటికీ, అదనంగా మరింత తేవాలని నిత్యమూ వేధించేవాడని పేర్కొంది. పద్మావతి ఫిర్యాదు మేరకు కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.