: ఇరు రాష్ట్రాల్లో పరిణామాలు చూస్తుంటే బాధేస్తోంది: దత్తాత్రేయ


టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు వ్యవహారం, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెందిన ఆడియో టేపుల విడుదలపై స్పందించనని కేంద్ర మంత్రి దత్తాత్రేయ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రెండు రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలు చూస్తుంటే చాలా బాధేస్తోందని అన్నారు. ఈ పరిణామాలు మంచిది కాదన్నారు. మొత్తం వ్యవహారాన్ని గవర్నర్ చూసుకుంటారని పేర్కొన్నారు. ఈరోజు గవర్నర్ నరసింహన్ ను కలసిన అనంతరం దత్తాత్రేయ మీడియాతో మాట్లాడుతూ, రేపటి తన జెనీవా ప్రయాణం విషయాన్ని వెల్లడించారు. 27 మంది ప్రతినిధులతో 10, 11, 12 తేదీల్లో నగరంలో జరిగే కార్మిక సమాఖ్య సదస్సులో పాల్గొంటున్నట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News