: చంద్రబాబు ఆడియో టేపులను జాతీయ స్థాయిలో వివాదాస్పదం చేసేందుకు సన్నద్ధమవుతున్న జగన్
ఓటుకు నోటు వ్యవహారంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఏ-1 ముద్దాయిగా చేర్చాలని కోరుతూ గవర్నర్ నరసింహన్ కు వైకాపా అధినేత జగన్ ఇప్పటికే వినతిపత్రం సమర్పించిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ వ్యవహారంలో చంద్రబాబు పాత్ర ఉందంటూ టీఎస్ ప్రభుత్వం టేపును విడుదల చేసింది. ఈ ఆధారాలతో మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని జగన్ యోచిస్తున్నట్టు సమాచారం. జాతీయ స్థాయిలో ఈ వ్యవహారాన్ని పెద్ద వివాదంగా మలచాలని, పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ లను కలవాలని భావిస్తున్నారు. తన ఎంపీలతో కలసి ఆయా నేతలను కలుస్తారని సమాచారం. గవర్నర్ నరసింహన్, చంద్రబాబు, కేసీఆర్ లు ఢిల్లీ బాట పట్టబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరికి జగన్ కూడా జత కలుస్తున్నారన్నమాట.