: మంగళగిరిలో నరసింహన్... పానకాల నరసింహస్వామిని దర్శించుకున్న గవర్నర్
తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ నవ్యాంధ్ర రాజధాని సమీపంలోని మంగళగిరి చేరుకున్నారు. గుంటూరు జిల్లాలో నేటి సాయంత్రం నిర్వహించతలపెట్టిన మహా సంకల్ప సభకు హాజరుకావాలన్న ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఆహ్వానం మేరకు నేటి ఉదయం గుంటూరు బయలుదేరిన నరసింహన్ కొద్దిసేపటి క్రితం మంగళగిరి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మంగళగిరిలోని పానకాల నరసింహస్వామిని దర్శించుకున్నారు. సాయంత్రం మహా సంకల్ప సభ ముగిసిన తర్వాత తిరిగి గవర్నర్ హైదరాబాద్ బయలుదేరతారు.