: రైల్వే పోలీసుల దాష్టీకం... రైల్లో చనిపోయిన వ్యక్తిని బయటకు ఈడ్చేసిన వైనం, కర్నూలులో దారుణం
కర్నూలు రైల్వే స్టేషన్ లో కొద్దిసేపటి క్రితం దారుణం చోటుచేసుకుంది. రైలులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ఉన్నట్టుండి బోగీలోనే చనిపోయాడు. బాధితుడి తరపు బంధువులు శోకసంద్రంలో ఉండగానే, రైల్వే పోలీసులు మృతదేహాన్ని కర్నూలు రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫాంపై పడేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితుడి బంధువులు రైల్వే పోలీసులతో వాదనకు దిగారు. అయినా కనికరం చూపని పోలీసులు తమ పని తాము చేశామన్న రీతిగా వ్యవహరించారు. దీంతో ఆందోళనకు దిగిన బాధితుడి బంధువులు రైలు పట్టాలపై బైఠాయించారు. దీంతో న్యూఢిల్లీ వెళ్లాల్సిన హజ్రత్ నిజాముద్దీన్ ఎక్స్ ప్రెస్ రైల్వే స్టేషన్ లోనే నిలిచిపోయింది.