: ఫోన్ ట్యాపింగ్ విషయంపై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తాం: మంత్రి పల్లె


తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ఫోన్ ట్యాపింగ్ సంభాషణల ఆడియో టేపుల అంశంపై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు. ఈ విషయంలో అవసరమైతే కేంద్రం వద్దకు వెళతామని, రాష్ట్రపతిని కూడా కలుస్తామని చెప్పారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన మంత్రి, ఫోన్ ట్యాపింగ్ చాలా పెద్ద నేరమన్నారు. అభద్రతా భావం వల్లే సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. 5 కోట్ల మంది ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని పల్లె పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News