: రేవంత్ పై మూడో రోజు విచారణ ప్రారంభం... రూ. 50 లక్షలపై విచారణ


ఓటుకు నోటు వ్యవహారంలో టీటీడీపీ నేత రేవంత్ రెడ్డిపై ఏసీబీ మూడో రోజు విచారణ ప్రారంభమైంది. దీనికి ముందు, అనారోగ్యంతో ఉన్న రేవంత్ ను చికిత్స నిమిత్తం సిట్ కార్యాలయం నుంచి నేరుగా ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. రేవంత్ తో పాటు సెబాస్టియన్ హ్యారీ, ఉదయ్ సింహలకు కూడా వైద్య పరీక్షలు నిర్వహించారు. వీరి ముగ్గురికీ షుగర్ లెవెల్స్ సాధారణంగా ఉన్నాయని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఏసీబీ కార్యాలయంలో, రూ. 50 లక్షల నగదుకు సంబంధించి అధికారులు రేవంత్ ను ప్రశ్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News