: జర్మనీ బీరు పార్టీలో ఎంజాయ్ చేసిన ఒబామా... అడ్డుగోడలు తొలగించుకునే యత్నం


గతాన్ని మరచి భవిష్యత్తులో కలసి పనిచేసే దిశగా ముందుకు సాగాలని, రష్యాను కట్టడి చేసే విషయంలో ఏకతాటిపై నిలవాలని అమెరికా, జర్మనీలు నిర్ణయించాయి. ప్రపంచదేశాధి నేతల సమావేశం నేపథ్యంలో జర్మనీ వచ్చిన ఆయనకు చాన్స్ లర్ ఏంజెలా మెర్కెల్ 'బీర్ విత్ బ్రేక్ ఫాస్ట్' పార్టీ ఇచ్చారు. ఆల్ప్స్ పర్వతాల పాదాల వద్ద ఉన్న టౌన్ స్క్వేర్ లో జరిగిన ఈ పార్టీకి సుమారు 800 మంది హాజరు కాగా, బీరు తాగుతూ, కలయదిరుగుతూ, ఒబామా ఎంజాయ్ చేశారు. ఇరు దేశాధినేతలూ మగ్గులు పట్టుకుని చీర్స్ చెప్పుకుని ఆహ్లాదంగా గడిపారు. ఉక్రెయిన్ విషయంలో రష్యా దుందుడుకు తనంగా వ్యవహరిస్తోందని, దీన్ని అడ్డుకోవాలని ఇరు నేతలూ అభిప్రాయపడ్డారు. రష్యాపై అమలు చేస్తున్న ఆర్థిక ఆంక్షలను ఇప్పట్లో తొలగించరాదని, ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని గౌరవించే వరకూ రష్యాపై ఒత్తిడి పెంచుతూనే ఉండాలని నిర్ణయించారు. జర్మనీని తమ దీర్ఘకాల భాగస్వామిగా అభివర్ణించిన ఒబామా, భవిష్యత్తులో మరిన్ని రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని పెంచుకోవాల్సి వుందని అన్నారు. కాగా, జి-7 సమావేశాల కోసం ఒబామా జర్మనీకి వచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News