: బెజవాడలో ఏపీ సీఎం క్యాంప్ ఆఫీస్ ప్రారంభం... పూజలు చేసిన చంద్రబాబు
విజయవాడలో నూతనంగా ఏర్పాటైన ఏపీ సీఎం క్యాంప్ ఆఫీస్ ప్రారంభమైంది. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కొద్దిసేపటి క్రితం ప్రత్యేక పూజలు చేసి తన కార్యాలయాన్ని ప్రారంభించారు. నేటి ఉదయం హైదరాబాదు నుంచి బయలుదేరిన చంద్రబాబు గన్నవరం విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి నేరుగా క్యాంప్ ఆపీస్ చేరుకున్నారు. వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య చంద్రబాబు ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఏపీ మంత్రులు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమామహేశ్వరరావు, కామినేని శ్రీనివాస్, కొల్లు రవీంద్ర తదితరులు హాజరయ్యారు.