: ఆడియో టేపులో దొరికిన తొలి సీఎం చంద్రబాబేనట!
అవినీతి అంశానికి సంబంధించి ఆడియో టేపు సాక్ష్యంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి దేశ చరిత్రలో ఇప్పటిదాకా ఎవరూ లేరు. నిన్న తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ఆడియో టేపులో మాత్రం ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు పట్టుబడ్డారు. అంటే, ఈ తరహాలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తొలి సీఎం చంద్రబాబేనట. తెలంగాణలో మొన్నటి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నిక సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ఓటును చేజిక్కించుకునేందుకు యత్నించి టీడీపీ అడ్డంగా బుక్కైంది. ఈ కేసులో టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి ఇప్పటికే అరెస్ట్ కాగా, తాజాగా ఇందులో చంద్రబాబుకూ ప్రత్యక్ష పాత్ర ఉందని ఆరోపిస్తూ కేసీఆర్ ప్రభుత్వం ఆడియో టేపును విడుదల చేసింది.