: సమస్య పరిష్కారం... చేతులు కలిపిన లాలూ, నితీష్
గత కొద్ది రోజులుగా నెలకొన్న సందిగ్ధతకు తెర పడింది. జనతా పరివార్ కూటమి ఆవిర్భవించింది. రానున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసే పోటీ చేయాలని ఆర్జీడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ లు నిర్ణయించారు. సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ నివాసంలో దాదాపు రెండు గంటల పాటు జరిగిన సమావేశంలో ఈ నిర్ణయానికి వచ్చారు. సీట్ల పంపకాల విషయమై ఆరుగురితో కూడిన ఒక ప్యానల్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే, ఇంతకాలం సందిగ్ధతకు కారణమైన సీఎం అభ్యర్థి విషయంలో మాత్రం అనిశ్చితి తొలగలేదు. అక్రమాస్తుల కేసులో దోషిగా తేలడంతో లాలూకు ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం లేదన్న విషయం తెలిసిందే.