: రేపు ఆంధ్రప్రదేశ్ ను తాకనున్న రుతుపవనాలు


ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నైరుతి రుతుపవనాలు రేపు ఆంధ్రప్రదేశ్ ను తాకనున్నాయి. ఈ విషయాన్ని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. విదర్భ నుంచి కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతోందని తెలిపింది. దీంతోపాటు, కోస్తాంధ్ర పరిసర ప్రాంతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని చెప్పింది. వీటి ప్రభావం వల్ల కోస్తాంధ్రలో కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవనాలు చురుగ్గా కదిలేందుకు పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయని వెల్లడించింది.

  • Loading...

More Telugu News