: నాకు ఎంతో ఆనందంగా ఉంది: టీఆర్ఎస్ ఎంపీ కవిత
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకోవడం తనకు ఎంతో సంతోషంగా ఉందని టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎంపీ కవిత అన్నారు. ఎంతో కష్టపడి తెలంగాణను సాధించుకున్నామని చెప్పారు. వేడుకల ముగింపు సందర్భంగా ట్యాంక్ బండ్ పై అన్ని జిల్లాల ప్రజలతో శోభాయాత్ర జరుగుతుందని తెలిపారు. వారం రోజుల పాటు వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించుకున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల కోసం ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తున్నారని... గతంలో ఈ విధంగా ఏ ముఖ్యమంత్రీ చేయలేదని అన్నారు.