: అసోంలో సాయుధ బలగాల తిరుగుబాటు


అసోంలో స్పెషల్ పోలీసులు తిరుగుబాటు చేశారు. తమ ఉద్యోగాలను క్రమబద్ధం చేయాలని డిమాండ్ చేస్తూ వారు ఈ చర్యకు దిగారు. ఈ క్రమంలో గౌహతిలో అసోం స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ ఆందోళనకు దిగారు. ఈ కార్యక్రమం హింసాయుతంగా మారింది. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కొందరు గాయపడ్డారు. తమ సమస్యల గురించి ఉన్నతాధికారులకు పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చామని... అయినా, వారిలో ఎలాంటి స్పందన రాకపోవడంతో, ఈ చర్యలకు ఉపక్రమించామని ఆందోళనకారులు తెలిపారు. గతంలో కూడా ఉత్తరప్రదేశ్ లో ఆర్మ్ డ్ కానిస్టేబులరీ తిరుగుబాటు చేసింది. అప్పట్లో అది సంచలనం అయింది.

  • Loading...

More Telugu News