: రాజకీయ వ్యవస్థ భ్రష్టు పట్టిపోతోంది: గుత్తా ఆవేదన


రాజకీయ పార్టీలు నానాటికీ దిగజారిపోతున్నాయని... రాజకీయ వ్యవస్థ భ్రష్టు పట్టిపోతోందని కాంగ్రెస్ సీనియర్ నేత, నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థను వివిధ పార్టీలు అపహాస్యం చేస్తున్నాయని మండిపడ్డారు. గతంలో కూడా ఫిరాయింపులు ఉండేవని... అయితే, అవి కేవలం ఎన్నికల సమయంలోనే ఉండేవని అన్నారు. ప్రస్తుత కాలంలో తమ పార్టీ బలం పెంచుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్న పార్టీలు... సమయంతో సంబంధం లేకుండా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాయని విమర్శించారు. ఇదే సమయంలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై గుత్తా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు టీఆర్ఎస్ ఏదైతే చేస్తోందో... భవిష్యత్తులో ఇదే పరిస్థితిని టీఆర్ఎస్ కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. నేతలకు ప్రస్తుతం బంధాలు, అనుబంధాల కంటే రాజకీయాలు, అధికారమే ప్రధానమైనవిగా మారాయని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News