: నాలుగేళ్లలో రామమందిర నిర్మాణాన్ని పూర్తి చేస్తాం: బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్
రామ మందిరం నిర్మాణంపై బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ మరోమారు సంచలన ప్రకటన చేశారు. బీజేపీ పాలనలోనే రామ మందిర నిర్మాణం పూర్తవుతుందని ఆయన కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. ‘‘బీజేపీ అధికారం చేపట్టి ఏడాది పూర్తవుతోంది, మరో నాలుగేళ్ల పాటు మేమే అధికారంలో ఉంటాం. ఈ నాలుగేళ్లలోనే రామ మందిర నిర్మాణాన్ని పూర్తి చేసి తీరతాం’’ అని ఆయన వ్యాఖ్యానించారు. రామ మందిర నిర్మాణాన్ని పూర్తి చేయకపోతే, మోదీ సర్కారు కూడా కూలిపోక తప్పదని నిన్న విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ) జాతీయ కార్యదర్శి సురేంద్ర జైన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. జైన్ వ్యాఖ్యల నేపథ్యంలో సాక్షి మహారాజ్ కొద్దిసేపటి క్రితం రామ మందిర నిర్మాణంపై మాట్లాడినట్లు తెలుస్తోంది.