: యువతీయువకుల పరస్పర అంగీకారంతోనే అత్యాచారాలు...యూపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్య


ఓ వైపు అత్యాచారాలపై దేశం అట్టుడికిపోతోంది. ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన నేపథ్యంలో కఠిన చట్టాలు అమల్లోకి వచ్చాయి. అయినా అత్యాచారాలు తగ్గుముఖం పట్టడం లేదని దేశ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఇక అత్యాచారాలకు కేంద్రంగా మారిన ఉత్తరప్రదేశ్ లో ప్రభుత్వ పెద్దలు వివాదాస్పద వ్యాఖ్యలతో జనాన్ని అసహనానికి గురి చేస్తున్నారు. ‘‘కుర్రాళ్లన్నాక తప్పులు చేస్తారు’’ అంటూ మొన్నటికి మొన్న యూపీ మాజీ సీఎం, అధికార పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ నోరు జారారు. తాజాగా ఆయన పార్టీ నేత, యూపీ మంత్రి తోతారామ్ యాదవ్ మరో అడుగు ముందుకేశారు. యువతీయువకుల పరస్పర అంగీకారంతోనే అత్యాచారాలు జరుగుతున్నాయని ఆయన వక్రభాష్యం చెప్పారు. అంతేకాక అత్యాచారాలు రెండు రకాలని ఆయన కొత్త అర్థం చెప్పారు. వీటిలో బలవంతంగా జరిగేది తొలి రకమైతే, యువతీయువకుల పరస్పర అంగీకారంతో జరిగేది రెండో రకమని ఆయన చెప్పారు. తొలి రకం అత్యాచారాలు జరగడం లేదని, రెండో రకానికి చెందిన అత్యాచారాలే జరుగుతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. యూపీలోని మెయిన్ పురి జైలును సందర్శించిన సందర్భంగా నిన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News