: ఈ నెల 12న తెలంగాణ కొత్త పారిశ్రామిక విధానం
తెలంగాణ రాష్ట్ర కొత్త పారిశ్రామిక విధానం 'టీఎస్ ఐపాస్'ను ఈ నెల 12వ తేదీన ప్రభుత్వం ప్రకటించనుంది. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఆ రోజు హైటెక్స్ లో పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు, పారిశ్రామిక ప్రతినిధులతో ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ కంపెనీల సీఈఓలకు ఆహ్వానాలు పంపనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్, అధికారులను ఆదేశించారు. పరిశ్రమలకు భూ కేటాయింపులు, అనుమతులు కేవలం 15 రోజుల్లోనే ఇచ్చేలా చర్యలు తీసుకోనున్నామని కేసీఆర్ తెలిపారు. అనంతరం తనను కలిసిన తెలంగాణ విద్యుత్ శాఖ ఇంజనీర్లతో సీఎం మాట్లాడుతూ, కోతలు లేని విద్యుత్ ను అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. విద్యుత్ శాఖలో లాభాలు రాగానే ఉద్యోగుల జీతాల పెంపు అంశంపై నిర్ణయం తీసుకుంటామని, ప్రస్తుతానికి ఉన్న ఖాళీలను భర్తీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.