: వేలానికి హాస్య చక్రవర్తి సూటు, బూటు, హ్యాటు
హాలీవుడ్ ప్రముఖ హాస్య నటుడు చార్లీ చాప్లిన్ సూటు, బూటు, హ్యాటు వేలానికి రానున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను కలిగిన చార్లీ చాప్లిన్ ఆహార్యంతోనే ఎంతో మందిని నవ్వించారు. చిత్రమైన, ఆయనకు మాత్రమే సాధ్యమైన నడకతో పాత్రకు ప్రాణం పోస్తూ, అంతులేని ఇబ్బందులు పడుతూ హాస్యాన్ని పండించిన చాప్లిన్ సూటు, బూటు, హ్యాటుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ సూటు, బూటు, హ్యాటు లండన్ లోని 'మ్యూజియం ఆఫ్ ద మూవింగ్ ఇమేజ్'లో ప్రదర్శనకు ఉంచారు. వీటిని వేలం వేయనున్నారు. కాగా, చాప్లిన్ వస్తువుల వేలానికి విశేషమైన ఆదరణ లభిస్తుందని నిర్వాహకులు ఆశిస్తున్నారు. హాస్య చక్రవర్తి దుస్తులకు ఆమాత్రం ఆదరణ లభించడం విశేషమేనా అని ఆయన అభిమానులు అంటున్నారు.