: జోకర్ ధాటికి తలవంచిన ముర్రే


జోకర్ అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకునే వరల్డ్ నెంబర్ వన్, సెర్బియా టెన్సిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ ఫైనల్ చేరాడు. ఫైనల్ లో స్విస్ స్టార్ స్టానిస్లాన్ వావ్రింకాతో తలపడనున్నాడు. కాగా, నాలుగు సెట్లు హోరాహోరీగా జరిగిన నిన్నటి మ్యాచ్ వర్షం కారణంగా నేటికి వాయిదా పడింది. తొలి రెండు సెట్లు జకోవిచ్ గెలుచుకోగా, మలి రెండు సెట్లలో ముర్రే పుంజుకుని జకోవిచ్ కు సవాలు విసిరాడు. నేడు జరిగిన ఐదో గేమ్ ను జకోవిచ్ గెలుచుకుని వరల్డ్ నెంబర్ వన్ టైటిల్ కు న్యాయం చేశాడు. తొలి రెండు సెట్లను 6-3, 6-3 తేడాతో సునాయాసంగా గెలుచుకున్న జకోవిచ్, మలి రెండు సెట్లలో 5-7, 5-7 తేడాతో ఓటమిపాలయ్యాడు. దీంతో నిర్ణాయకమైన ఐదో సెట్ ను 6-1 తేడాతో గెలుచుకుని తనకు తిరుగులేదని చాటాడు. టైటిల్ పోరులో స్విట్జర్లాండ్ ఆటగాడు స్టానిస్లాన్ వావ్రింకాతో తలపడనున్నాడు.

  • Loading...

More Telugu News