: భారత్-బంగ్లాదేశ్ మధ్య కీలక ఒప్పందం
ప్రధానమంత్రి నరేంద్రమోదీ బంగ్లాదేశ్ పర్యటనలో కీలక ఒప్పందం కుదిరింది. 1974 నాటి భూసరిహద్దు ఒప్పందం అమలుకు అంగీకరిస్తూ మోదీ, బంగ్లా ప్రధాని షేక్ హసీనాల సమక్షంలో ఈరోజు భారత్-బంగ్లాలు ఒప్పందం చేసుకున్నాయి. దాంతో రెండు దేశాల్లో శాంతి భద్రతలు మెరుగుపరిచేందుకు అవకాశం ఏర్పడింది. ఈ క్రమంలో ఇరు దేశాల ద్వైపాక్షిక బంధం బలోపేతం దిశగా చారిత్రక అడుగు పడింది. అంతకుముందు ఇరు దేశాల మధ్య రెండు బస్సు సర్వీసులను మోదీ ప్రారంభించారు.