: సోనార్ గావ్ హోటల్లో కలుసుకున్న మోదీ, మమత


బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ భారత్-బంగ్లాదేశ్ మధ్య బస్సు సర్వీసులను ప్రారంభించారు. ఆ ప్రారంభోత్సవానికి ముందు ప్రధానిని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఢాకాలోని సోనార్ గావ్ హోటల్ లో కలుసుకున్నారు. కాసేపు మాట్లాడుకున్న అనంతరం వారు బస్సు సర్వీసుల ప్రారంభోత్సవానికి వెళ్లారు. కోల్ కతా-ఢాకా-అగర్తలా; ఢాకా-షిల్లాంగ్-గువాహటి బస్సు సర్వీసులకు మోదీ, మమతా, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా పచ్చజెండాలు ఊపారు. ఈ సర్వీసులు భారత్, బంగ్లాదేశ్ బంధాన్ని పటిష్టం చేస్తాయని ఆశిస్తున్నట్టు మోదీ పేర్కొన్నారు. కాగా, ఈ నూతన బస్సు సర్వీసుల కారణంగా ఇరు దేశాల మధ్య రాకపోకలు మరింత సులువవుతాయని అధికారులు భావిస్తున్నారు. ఈ ఉదయం బంగ్లాదేశ్ లో అడుగుపెట్టిన ప్రధానికి ఘనస్వాగతం లభించింది. ఆయన పర్యటనకు బంగ్లా మీడియా విశేషమైన ప్రాధాన్యం ఇచ్చింది. ఇదో చారిత్రాత్మక పర్యటన అని పేర్కొంది. ఇక, మోదీ బంగ్లాదేశ్ పర్యటన నేపథ్యంలో, రిలయన్స్, అదానీ గ్రూపులు బంగ్లాదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.

  • Loading...

More Telugu News