: 15 ఏళ్లయినా చెక్కు చెదరని మృతదేహం!
15 ఏళ్ల తరువాత లభ్యమైన ఓ మృతదేహం ఏ మాత్రం చెక్కుచెదరకుండా వుంది. ఇది 25 ఏళ్ల వ్యక్తికి సంబంధించిన మృతదేహం అని మెక్సికో అధికారులు తెలిపారు. మెక్సికోలోని పికో డీ ఒరిజాబా పర్వతంపై మంచులో దొరికిన మూడవ మృతదేహంగా వారు వెల్లడించారు. అయితే గతంలో లభ్యమైన రెండు మృతదేహాలు పర్వతారోహకులవి. 1990లో ఈ పర్వతం మీదుగా ప్రయాణించిన ఓ విమానం కూలిపోయిందని, ఇది అందులోని ప్రయాణికుడిదై ఉండవచ్చని అధికారులు తెలిపారు. పూర్తిగా మంచుతో కప్పబడి ఉండడం వల్ల మృతదేహం చెక్కు చెదరలేదని, మృతుడు ఎవరు? అనే విషయం ఆరాతీస్తున్నామని అధికారులు తెలిపారు.