: చంద్రబాబు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది: నాయిని


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, చట్టం చినబాబు, పెదబాబు అని చూడదని అన్నారు. రేపు హైదరాబాదులో భారీ ఉత్సవాలు జరుగుతాయని ఆయన చెప్పారు. లక్షమందితో భారీ ర్యాలీ నిర్వహించనున్నామని ఆయన చెప్పారు. హైదరాబాదును ట్రాఫిక్ సిగ్నల్స్ లేని నగరంగా చూడాలని సీఎం కేసీఆర్ తపిస్తున్నారని ఆయన తెలిపారు. రెండేళ్ల తరువాత తెలంగాణ ఇతర రాష్ట్రాలకు విద్యుత్ సరఫరా చేస్తుందని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News