: టాలీవుడ్ 'మృత్యుంజయ హోమం' నిష్ఫలమేనా?
కొంతకాలం క్రితం వరుస మరణాలతో భీతిల్లిపోయిన తెలుగు చిత్ర పరిశ్రమ మృత్యుంజయ హోమం నిర్వహించి ఊపిరి పీల్చుకుంది. 'ఇంకేం కాదులే' అని ధైర్యం తెచ్చుకున్నంతలో ఇండస్ట్రీని ఆర్తి అగర్వాల్ మరణం తీవ్రంగా కుదిపేసింది. ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఏవీఎస్, శ్రీహరి, ఎంఎస్ నారాయణ, ఉదయ్ కిరణ్, 'ఆహుతి' ప్రసాద్, చక్రి, శ్రీ చక్రవర్తి... ఇలా ప్రముఖులను కోల్పోయిన టాలీవుడ్ కు తాజా వార్త మరింత దిగ్భ్రాంతి కలిగించింది. ఏమంత వయసు లేని నటులు, టెక్నీషియన్స్ కూడా మరణిస్తుండడంతో పరిశ్రమలో భయానక వాతావరణం తాండవిస్తోంది.