: చర్లపల్లి జైల్లోనే రేవంత్ విచారణ... అదెలా కుదురుతుందంటున్న లాయర్లు
'ఓటుకు నోటు' వ్యవహారంలో ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని చర్లపల్లి జైల్లోనే విచారిస్తున్నట్టు సమాచారం. నిన్న రేవంత్ తో పాటు సెబాస్టియన్, ఉదయ్ సింహాల కస్టడీకి కోర్టు అనుమతి పొందిన ఏసీబీ అధికారులు, ఈ ఉదయం సెబాస్టియన్, ఉదయ్ లను మాత్రమే ఏసీబీ కార్యాలయానికి తీసుకువచ్చారు. రేవంత్ ను మాత్రం చర్లపల్లి జైల్లోనే ఉంచారు. దీనిపై ఆయన తరపు న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చర్లపల్లి జైల్లోనే ఆయన్ను ప్రశ్నించడం చట్ట విరుద్ధమని, తమ సమక్షంలోనే ఇంటరాగేషన్ చేయాలన్నది కోర్టు పెట్టిన నిబంధనగా వారు గుర్తు చేశారు. కాగా, మరోవైపు సెబాస్టియన్, ఉదయ్ ల న్యాయవాదులను సైతం ఏసీబీ కార్యాలయం లోపలికి అనుమతించ లేదు.