: విజయవాడలో ప్రత్యేక హోదాపై జనసేన కార్యకర్తల ఆందోళన


ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై తొలిసారి జనసేన పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. విజయవాడలోని కాళేశ్వరరావు మార్కెట్ వద్ద ధర్నా చేపట్టారు. ఏపీకు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ పార్టీ వ్యవస్థాపకుడు, నటుడు పవన్ కల్యాణ్ ఫ్లెక్సీలు, జనసేన జెండాలతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సహా టీడీపీ మంత్రులు రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. రాజధానికి భూమిపూజ చేసిన రోజే వారు ఆందోళనకు దిగడం గమనార్హం.

  • Loading...

More Telugu News