: అభిమాని వీరావేశం... ఇబ్బందిపడిన దీపిక
సినిమా తారలకు అభిమానులు ఒక్కోసారి ఇబ్బందికరంగా పరిణమిస్తుంటారు. వారి ప్రైవసీని హరించివేస్తుంటారు. మరికొందరు మితిమీరిన అభిమానంతో ప్రవర్తిస్తుంటారు. బాలీవుడ్ భామ దీపికా పదుకునేకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. 'దిల్ ధడ్కనే దో' సినిమా సక్సెస్ మీట్ సందర్భంగా ఓ సూపర్ ఫ్యాన్ ఆమె వైపు వీరావేశంతో దూసుకొచ్చాడు. దగ్గరగా వచ్చి ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ స్టయిల్లో దీపికను తన మొబైల్ తో వివిధ యాంగిల్స్ లో క్లిక్ మనిపించసాగాడు. దీంతో, దీపిక చాలా ఇబ్బందిపడిపోయిందట. అమ్మడి బాడీగార్డులు అడ్డుచెప్పినా ఆ అభిమానిలో ఆవేశం చల్లారలేదు సరికదా, జోరు మరికాస్త పెరిగింది. దీంతో, అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. చివరికి ఎలాగోలా అతడి కెమెరా తాకిడి నుంచి బయటపడి ఊపిరిపీల్చుకుంది దీపిక.