: ఏం జరుగుతోందక్కడ?... రేవంత్ వ్యవహారంపై కేంద్రం ఆరా
రేవంత్ రెడ్డి ఓటుకు నోటు వ్యవహారంపై కేంద్రం దృష్టి సారించింది. కేసుకు సంబంధించి పూర్తి వివరాలు కావాలంటూ ప్రధానమంత్రి కార్యాలయం, కేంద్ర హోం శాఖ గవర్నర్ నరసింహన్ ను కోరినట్టు తెలిసింది. కేంద్రం ఆదేశాలతో గవర్నర్ దీనిపై ఓ నివేదిక రూపొందించే పనిలో పడ్డారు. కేసుకు సంబంధించిన వివరాలు అందించాలంటూ, రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులను, సీఎస్ ను పురమాయించారు. ఈ క్రమంలోనే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరావు గవర్నర్ ను కలిసినట్టు అర్థమవుతోంది. ఆ సమయంలో సీఎం కేసీఆర్ వెంట ఏసీబీ డీజీ ఏకే ఖాన్, ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి కూడా ఉన్నారు. అన్ని వివరాలతో కూడిన సమగ్ర నివేదిక రూపొందించాక గవర్నర్ హస్తిన వెళ్లే అవకాశాలున్నాయి.