: నాకు ఎక్కడికీ వెళ్లబుద్ధికావడం లేదు: రాజధానిపై చంద్రబాబు మమకారం


రాజధాని అమరావతి భూమిపూజ అనంతరం సీఎం చంద్రబాబు మందడంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. తొలుత రైతులకు పాదాభివందనం చేసిన ఆయన, ఇది ప్రజా రాజధాని అని, అందరూ సహకారం అందిస్తే కొండలనైనా బద్దలు చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. రాజధాని కోసం ప్రతి ఒక్కరూ ఒక ఇటుకను, లేదా, అందుకు సమానమైన విరాళం ఇవ్వాలని పిలుపునిచ్చారు. రాజధాని ప్రాంతానికి వచ్చినప్పుడు తనకు ఎక్కడికీ వెళ్లబుద్ధికావడం లేదని నూతన రాజధానిపై తన మమకారాన్ని చాటుకున్నారు. రాజధాని ప్రాంతానికి పక్కనే ఉన్న కృష్ణమ్మను చూసినప్పుడు ఎంతో ఆనందం కలుగుతుందన్నారు. సింగపూర్ నుంచి వచ్చిన నిపుణుల బృందం "మీ రాజధాని అమరావతి సింగపూర్ కంటే మెరుగ్గా వస్తుంది" అని చెప్పినప్పుడు ఎంతో సంతోషించానని తెలిపారు.

  • Loading...

More Telugu News