: గన్నవరం చేరుకున్న బాబు... మరికాసేపట్లో మందడం గ్రామానికి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాదు నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్నారు. ఇక్కడి నుంచి చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి తదితరులు హెలికాప్టర్‌లో గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడం గ్రామానికి చేరుకోనున్నారు. ఉదయం 8:49 నిమిషాలకు జరిగే భూమిపూజ కార్యక్రమంలో పాల్గొని, అనంతరం పలు శాస్త్రోక్త కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అనంతరం స్థానిక రైతులను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. భూమిపూజ కార్యక్రమంలో పాల్గొనేందుకు పలువురు కేంద్ర రాష్ట మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మందడం చేరుకున్నారు.