: మరింత వేగంగా తత్కాల్ టిక్కెట్ల బుకింగ్


అత్యవసర ప్రయాణం పెట్టుకుని రైల్లో తత్కాల్ టిక్కెట్ బుక్ చేసుకోవాలంటే ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. తెల్లవారుఝామున రైల్వే స్టేషనుకు వెళ్లి గంటల తరబడి క్యూలో నిలబడ్డా టిక్కెట్ దొరుకుతుందో లేదో తెలియని పరిస్థితి. ఇక ఆన్ లైన్లో బుక్ చేసుకోవాలంటే డిమాండ్ పెద్దగా లేని రైళ్లకే లభిస్తాయి. దీనికితోడు రెండు మూడు గంటల వ్యవధిలో 2.5 లక్షల పీఎన్ఆర్ నెంబర్లు, 4.5 లక్షల టిక్కెట్లు బుక్ అవుతాయి. దీంతో ఐఆర్ సీటీసీ సర్వర్ పై విపరీతమైన ఒత్తిడి పడి పలుమార్లు సాంకేతిక సమస్యలు తలెత్తిన ఘటనలెన్నో జరిగాయి. ఇకపై ఇటువంటివి జరగకుండా, సులువుగా తత్కాల్ టిక్కెట్లను బుక్ చేయడంతో పాటు ఒత్తిడిని తట్టుకునేలా మరో హై స్పీడ్ సర్వర్ ను అందుబాటులోకి తెచ్చినట్టు ఐఆర్ సీటీసీ సీఎండీ ఏకే మనోచా వెల్లడించారు. ఇప్పటివరకూ నిమిషానికి 7,200 టిక్కెట్లు బుక్ అయ్యే సామర్థ్యం ఉండగా, ఇకపై అది 14 వేల టిక్కెట్లకు పెరగనుందని వివరించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 54 శాతం టిక్కెట్లు ఐఆర్ సీటీసీ ద్వారా బుక్ అవుతున్నట్టు ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News