: ప్రతీకారం తీర్చుకుంటున్న నరేంద్ర మోదీ: కేజ్రీవాల్ ఆరోపణ


ఢిల్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత మోదీలో ప్రతీకారేచ్ఛ పెరిగిందని, ఆయన ప్రజలెన్నుకున్న ప్రభుత్వంపై ప్రతీకారం తీర్చుకుంటున్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఓ టెలివిజన్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీకి లెఫ్టినెంట్ గవర్నరుగా ఉన్న నజీబ్ జంగ్ బీజేపీకి 'పోలింగ్ ఏజంట్' వంటి వాడని, ఆయన అధికార కార్యాలయాన్ని బీజేపీ హెడ్ క్వార్టర్స్ గా మార్చివేశారని ఆరోపించారు. "ఢిల్లీ ప్రజలు మాకు ఓటేశారు. మిగతా దేశమంతా మోదీకి మద్దతిచ్చింది. కాబట్టి దయచేసి మీరు దేశాన్ని పాలించి ఢిల్లీని మాకు వదలండి. లెఫ్టినెంట్ గవర్నరును అడ్డుపెట్టుకుని ప్రతిరోజూ సమస్యలు సృష్టించొద్దు. ఢిల్లీని కోల్పోయినందుకు ఆప్, ఢిల్లీ వాసులపై ప్రతీకారం తీర్చుకోవడం సరైనది కాదు" అని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News