: 'తెలంగాణ' పెద్దలైనా సరే, దొరికితే వదిలేది లేదంటున్న ఏపీ పోలీస్


రేవంత్ రెడ్డి ఉదంతంతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెరపైకి వచ్చింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫోన్ ను కూడా ట్యాప్ చేసినట్టు వార్తలు రావడం తెలిసిందే. ఈ విషయాన్ని ఏపీ పోలీస్ విభాగం తీవ్రంగా పరిగణిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కు ఆదేశాలిచ్చింది తెలంగాణ సర్కారు ప్రముఖులైనాగానీ వదిలిపెట్టబోమని, ఎంతటివారైనా కేసులు ఎదుర్కోక తప్పదని ఏపీ పోలీసు బాసులు హెచ్చరిస్తున్నారు. చంద్రబాబు ఫోన్ రికార్డులు తమ వద్ద ఉన్నాయని తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పడాన్ని ఏపీ పోలీస్ ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకున్నారు. ట్యాప్ చేయమన్నది ఎవరు? ఎవరు ట్యాప్ చేశారు? అంటూ లోతైన దర్యాప్తుపై దృష్టిపెట్టారు. ఈ వ్యవహారంలో ఓ కీలక ఆధారం ఏపీ పోలీసులకు లభ్యమైనట్టు సమాచారం.

  • Loading...

More Telugu News