: వీటిని తప్పించుకుని కాపీ కొట్టాలంటే కష్టమే!


పరీక్షల్లో కాపీ కొట్టడం చాలా సహజమైన విషయం. కొందరు సరిగా చదవకుండా, పరీక్షలు పాసవ్వాలని ఇలా అక్రమమార్గం ఎంచుకుంటారు. వారిని కట్టడి చేసేందుకు ఇన్విజిలేటర్లు వేయి కళ్లతో పహరా కాస్తుంటారు. టెక్నాలజీ పెరిగిపోయిన ప్రస్తుత కాలంలో, కాపీరాయుళ్లు హైటెక్ పద్ధతులతో ఇన్విజిలేటర్లను బురిడీ కొట్టించేందుకు యత్నించిన ఘటనలు ఎన్నో చూశాం. అలాంటి వారికి చెక్ పెట్టేందుకు ఉపయుక్తంగా ఉంటాయని చైనాలో డ్రోన్లను రంగంలోకి దించుతున్నారు. ఇవి పైభాగంలో తిరుగాడడం వల్ల ఎక్కువ ప్రాంతాన్ని పర్యవేక్షించడానికి వీలవుతుంది. చైనాలోని గావోకావో విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష సందర్భంగా డ్రోన్లను ఉపయోగించాలని నిర్ణయించారు. ఈ పరీక్షకు రెండు లక్షల మంది హాజరవుతారని, అంత మందిపై నిఘా అంటే కష్టమేనని, అందుకే ఇన్విజిలేటర్లుగా డ్రోన్ లను వినియోగిస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. డ్రోన్లకు అమర్చిన కెమెరాల సాయంతో ఎవరేం చేస్తున్నారన్నది స్పష్టంగా తెలిసిపోతుంది.

  • Loading...

More Telugu News