: లక్ష లడ్డూల పంపిణీకి కేసీఆర్ ఆదేశం


ఈ నెల 2న మొదలైన తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలు, ఈ నెల 7తో ముగియనున్నాయి. ఆ రోజున ట్యాంక్ బండ్ వద్ద ముగింపు ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర సర్కారు భారీగా ఏర్పాట్లు చేస్తుంది. జూన్ 7 (ఆదివారం) రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు ఉత్సవాలు నిర్వహిస్తారు. లేజర్ షోలు, ఆధునిక త్రీడీ లైటింగ్, బాణాసంచా వెలుగుజిలుగులతో ఆదివారం రాత్రి ట్యాంక్ బండ్ ను జిగేల్మనిపించేలా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతకుముందు, సాయంత్రం 5 గంటల నుంచి నిజాం కాలేజ్ మైదానం నుంచి ట్యాంక్ బండ్ వరకు ర్యాలీ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా, లక్ష మందికి లడ్డూలు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News