: 'మ్యాగీ' విషయంలో 'నో కాంప్రమైజ్' అంటున్న కేంద్రం


మ్యాగీ నూడిల్స్ విషయంలో కేంద్రం రాజీపడేది లేదని స్పష్టం చేసింది. ఆహార భద్రత ప్రమాణాలను మ్యాగీ ఉల్లంఘించిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు. భారత్ లో ఆహార భద్రత విషయంలో ఎవరినీ ఉపేక్షించబోమని అన్నారు. అన్ని రాష్ట్రాల నుంచి తమకు నివేదికలు అందాయని, నెస్లే కంపెనీ, మ్యాగీ ఉత్పత్తులు ఆహార భద్రత ప్రమాణాలకు అనుగుణంగా లేవన్న విషయం తెలుసుకున్నామని చెప్పారు. అందుకే, మ్యాగీలోని 9 రకాలను మార్కెట్ నుంచి వెనక్కితీసుకోవాలని ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. ప్రజల ఆరోగ్యం కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని నడ్డా స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News