: ప్రతీకారం కాదు, పరాజయమే... వాంగ్ చేతిలో మళ్లీ చిత్తయిన సైనా
భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ మరోసారి 'చైనా గోడ'కు తలవంచింది. ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో సైనా 21-16, 12-21,18-21తో చైనా క్రీడాకారిణి షిజియాన్ వాంగ్ చేతిలో పరాజయం పాలైంది. సైనా ఈ క్వార్టర్ ఫైనల్లో నెగ్గడం ద్వారా, ఆస్ట్రేలియన్ ఓపెన్ లో వాంగ్ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటుందని అందరూ భావించారు. కానీ, శుక్రవారం జరిగిన పోరులో సైనా బలహీనతలపైనే దృష్టిపెట్టిన వాంగ్ తొలి గేమ్ కోల్పోయినా, అద్భుత రీతిలో పుంజుకుని విజయం సాధించింది.