: విధిలేని పరిస్థితిలో భారతీయుడినని ఒప్పుకున్న గిలానీ


జమ్మూ కాశ్మీర్ వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీ షా గిలానీ ఎట్టకేలకు తాను భారతీయుడినేనని ఒప్పుకున్నారు. ఈ రోజు పాస్ పోర్ట్ కార్యాలయానికి చేరుకున్న ఆయన జాతీయత అనే ఆప్షన్ లో ఇండియన్ అని టిక్ చేశారు. అక్కడి కార్యాలయంలో వేలి ముద్రలు, ఐరిష్ తదితరాలను సమర్పించారు. అనంతరం గిలానీ మాట్లాడుతూ, పుట్టుకతో తాను భారతీయుడిని కాదని... అయినా తప్పడం లేదని... బలవంతంగా భారతీయుడిని అయ్యానని చెప్పారు. కాశ్మీర్ కు చెందిన ఎవరైనా సరే విదేశాలకు వెళ్లాలనుకుంటే... ఇండియన్ పాస్ పోర్టుతోనే వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. జాతీయతకు వ్యతిరేకంగా వ్యాఖ్యానించినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. మరోవైపు, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ, పాస్ పోర్ట్ ఇవ్వడమనేది సమస్యే కాదని... గతంలో కూడా ఆయనకు ఎన్నోసార్లు ఈ సౌకర్యాన్ని కల్పించారని గుర్తు చేశారు. తన కుమార్తెను చూడటానికి సౌదీకి వెళ్లాలనుకుంటున్నారు గిలానీ. అందుకే ఆయన పాస్ పోర్టు కోసం అప్లై చేశారు.

  • Loading...

More Telugu News